తెలంగాణ

telangana

ETV Bharat / state

సైదాబాద్​ డివిజన్​లో భాజపా జెండా ఎగురవేస్తాం: అరుణా రవీందర్​రెడ్డి - Ghmc elections 2020

జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా సైదాబాద్ డివిజన్ పరిధిలో భాజపా కార్పొరేటర్ అభ్యర్థి కొత్త కాపు అరుణా రవీందర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. మేయర్ పీఠం కైవసం చేసుకుంటే మేనిఫెస్టోను కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.

సైదాబాద్​ డివిజన్​లో భాజపా జెండా ఎగురవేస్తాం: అరుణా రవీందర్​రెడ్డి
సైదాబాద్​ డివిజన్​లో భాజపా జెండా ఎగురవేస్తాం: అరుణా రవీందర్​రెడ్డి

By

Published : Nov 28, 2020, 4:52 PM IST

సైదాబాద్ డివిజన్​లో భాజపా జెండా ఎగురవేస్తామని కార్పొరేటర్ అభ్యర్థి కొత్త కాపు అరుణా రవీందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా సైదాబాద్ డివిజన్ పరిధిలోని ఏకలవ్య నగర్ కాలనీలో ఆమె ప్రచారం నిర్వహించారు.

ప్రజలంతా భాజపాకే ఓట్లు వేస్తామని చెబుతున్నారని ఆమె తెలిపారు. సమస్యలు పరిష్కరించడంలో తెరాస విఫలమైందని ఆరోపించారు. మేయర్ పీఠం కైవసం చేసుకుంటే భాజపా మేనిఫెస్టోను కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.

సైదాబాద్​ డివిజన్​లో భాజపా జెండా ఎగురవేస్తాం: అరుణా రవీందర్​రెడ్డి

ఇదీ చూడండి :గ్రేటర్​లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి ఎన్నికల ప్రచారం

ABOUT THE AUTHOR

...view details