జనతా కర్ఫూతో రోడ్లు ఖాళీగా ఉన్నాయని మితిమీరిన వేగంతో వాహనాలు నడిపి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉండడం వల్ల ఫ్లై ఓవర్లను మూసివేయాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆదేశించారు. కమిషనరేట్ పరిధిలోని మైండ్ స్పేస్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, సైబర్ టవర్స్, ఫ్లై ఓవర్లను మూసివేయాలన్నారు.
సైబరాబాద్ పరిధిలో అన్ని ప్లైఓవర్లు మూసివేత - janatha curfew
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నాలుగు ఫ్లై ఓవర్లను మూసివేయాలని అధికారులను ఆదేశించారు సీపీ వీసీ సజ్జనార్. మైండ్ స్పేస్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, సైబర్ టవర్స్, ఫ్లై ఓవర్లను వెంటనే మూయాలన్నారు.

ఫ్లై ఓవర్లు మూసివేయండి: సీపీ సజ్జనార్
జనతా కర్ఫూతో రోడ్లపై పరిస్థితిని ఆయన సమీక్షించారు. ప్రతి ఒక్కరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తిని పాటిస్తున్నారని ప్రశంసించారు. పోలీసులు ఎప్పకటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సజ్జనార్ సూచించారు.
సైబరాబాద్ పరిధిలో అన్ని ప్లైఓవర్లు మూసివేత
ఇదీ చూడండి:జనతా కర్ఫ్యూ'తో ఉత్తర భారతం ఇలా..
Last Updated : Mar 22, 2020, 2:52 PM IST