తెలంగాణ

telangana

ETV Bharat / state

విలీనంపై వివాదం - government

సహకార బ్యాంకుల్లో విలీన ప్రతిపాదనలపై వివాదం నెలకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్యాక్స్​, డీసీసీబీ, టీఎస్​క్యాబ్​లతో మూడంచెల వ్యవస్థ ఉంది. డీసీసీబీలను టీఎస్​క్యాబ్​లో కలిపేయాలని డీసీసీబీ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. అలా కలిపితే ప్యాక్స్​ నష్టాల్లో మునిగిపోతాయని టీఎస్​క్యాబ్​ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వ నిర్ణయం కీలకంగా మారింది.

సహకార బ్యాంకుల విలీన ప్రతిపాదనలపై వివాదం

By

Published : Mar 5, 2019, 1:25 PM IST

Updated : Mar 5, 2019, 6:09 PM IST

సహకార బ్యాంకుల విలీన ప్రతిపాదనలపై వివాదం

సహకార బ్యాంకుల విలీన ప్రతిపాదనలపై సరికొత్త వివాదం రాజుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో సహకార బ్యాంకుల్లో మూడంచెల వ్యవస్థ ఉంది. రాష్ట్రస్థాయిలో తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంకు, జిల్లా స్థాయిలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, గ్రామస్థాయిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు సహకార రుణాలిస్తున్నారు. డీసీసీబీలను టీఎస్‌క్యాబ్‌లో విలీనం చేసి దీనిని మూడంచెల నుంచి రెండంచెల స్థాయికి కుదిస్తే మంచిదని డీసీసీబీ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.


ప్రభుత్వ నిర్ణయమే కీలకం..
ఇటీవల పంజాబ్‌, జార్ఖండ్‌, కేరళ రాష్ట్రాల్లో ఈ విధంగా అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించడాన్ని ఉద్యోగ సంఘాలు కారణంగా చూపుతూ తెలంగాణలోనూ అలాగే చేయాలని కోరుతున్నాయి. దీనివల్ల నష్టాలు మరింత ఎక్కువై ప్యాక్స్‌ దెబ్బతింటాయని టీఎస్‌క్యాబ్‌ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశంపై అటు డీసీసీబీ, ఇటు టీఎస్‌క్యాబ్‌ ఉద్యోగసంఘాలు పరస్పర విరుద్ధ వైఖరితో పోరాడుతున్నాయి. ఈ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది కీలకంగా మారింది.


ప్రస్తుతం రాష్ట్రంలో 906 ప్యాక్స్‌కు 9 డీసీసీబీల ద్వారా రుణాలు అందుతున్నాయి. ఇందులో 479 ప్యాక్స్‌ మాత్రమే లాభాల్లో, మిగతావి నష్టాల్లో ఉన్నాయి. టీఎస్‌క్యాబ్‌ పనితీరు మెరుగ్గా ఉన్నందున సాధారణ వాణిజ్య బ్యాంకుల మాదిరిగా దానికి రిజర్వుబ్యాంకు షెడ్యూల్డ్‌ బ్యాంకు హోదా కల్పించింది. దీనివల్ల టీఎస్‌క్యాబ్‌ ఉద్యోగుల జీతభత్యాలు, సదుపాయాలు డీసీసీబీల వారికన్నా ఎక్కువగా ఉన్నాయి. రెండంచెలకు మారిస్తే వారి స్థాయిలోనూ తామూ పొందుతాము అనేది డీసీసీబీ శాఖల ఉద్యోగుల భావన.


రాష్ట్రమంతా డీసీసీబీ శాఖలన్నీ టీఎస్‌క్యాబ్‌ శాఖలుగా మారిపోతే వాటికి, ప్యాక్స్‌కు వచ్చే నష్టాలు టీఎస్‌క్యాబ్‌ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతాయి. పైగా ప్యాక్స్‌కు పాలనాధికారం ఉండటం వల్ల నేరుగా పర్యవేక్షణ ఉండదని టీఎస్‌క్యాబ్‌ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు.

ఇవీ చదవండి: 'ఎలక్ట్రిక్ బస్సులు వచ్చేశాయ్'

Last Updated : Mar 5, 2019, 6:09 PM IST

ABOUT THE AUTHOR

...view details