తెలంగాణ

telangana

ETV Bharat / state

Safety Precautions in Monsoon Telugu : భారీ వర్షాల వేళ బయటకెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు మరవకండి..? - వర్షాలు పడుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Safety Precautions in Monsoon Telugu : హైదరాబాద్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేని వానలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పలుచోట్ల వృక్షాలు విరిగిపడి.. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రహదారులపైకి వరద నీరు చేరి.. కొన్ని ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరో 3 రోజుల పాటు పరిస్థితులు ఇలాగే ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచించింది. ఈ నేపథ్యంలోనే వర్షాల వేళ ఈ జాగ్రత్తలు పాటించాలంటూ పోలీస్‌, విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. మరి అవేంటో ఓసారి చూద్దామా..?

Precautions During Rains Days
Precautions During Heavy Rains

By ETV Bharat Telangana Team

Published : Sep 5, 2023, 10:10 AM IST

Updated : Sep 5, 2023, 10:22 AM IST

Safety Precautions in Monsoon Telugu :రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ జి.రఘుమా రెడ్డి సంస్థ పరిధిలోని చీఫ్ జనరల్ మేనేజర్, సూపరింటెండెంట్‌, ఇంజినీర్లతో ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షించారు. వర్షాలు పడేటప్పడు సాధారణ ప్రజలు, విద్యుత్ వినియోగదారులు స్వీయ జాగ్రత్తలు పాటించాలని సీఎండీ కోరారు. దాంతో పాటు పలు జాగ్రత్తలు సూచించారు. అవేంటంటే..?

Hyderabad Rains Today : హైదరాబాద్​కు రెడ్ అలర్ట్.. మరో గంటపాటు కుండపోత వర్షం.. విద్యాసంస్థలకు సెలవు

  • వర్షాలు పడేటప్పుడు స్టే వైర్, విద్యుత్ లైన్ల కింద, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద నిలబడరాదు. వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండాలి. పశువులను, పెంపుడు జంతువులను కూడా విద్యుత్ పరికరాల నుంచి దూరంగా ఉంచాలి.
  • ఎక్కడైనా రోడ్డు మీద, నీటిలో కానీ విద్యుత్ తీగ పడి ఉంటే.. ఆ తీగను తొక్కడం గానీ, వాటి మీద నుంచి వాహనాలు నడపడం గానీ చేయరాదు. ఒకవేళ ఎక్కడైనా వైర్లు తెగిపడ్డట్టు ఉంటే వెంటనే సమీప విద్యుత్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాలి.
  • చెట్ల కొమ్మలపై, వాహనాలపై, ఇతర భవనాలపై తెగి పడ్డ తీగలు ఉన్నట్లయితే వెంటనే సంస్థ దృష్టికి తీసుకెళ్లాలి.
  • భారీ గాలులు, వర్షం పడేటప్పుడు విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు ఉన్నట్లయితే.. విద్యుత్ పరికరాలను ఆఫ్ చేసి వెంటనే కంట్రోల్ రూమ్‌కు తెలియజేయాలి.
  • విద్యుత్ అంతరాయం ఫిర్యాదుల నమోదు కోసం కంట్రోల్ రూమ్‌కు సంప్రదించే వినియోగదారులు తమ బిల్లుపై ముద్రితమైన యూఎస్‌సీ నెంబర్‌ను సిద్ధంగా ఉంచుకోవాలి.
  • లోతట్టు ప్రాంతాల్లో, అపార్ట్‌మెంట్ సెల్లార్‌లలో నీళ్లు చేరితే వెంటనే విద్యుత్‌ సిబ్బందికి తెలియజేయాలి.
  • విద్యుత్‌కు సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి ఉన్నా.. 1912 నెంబర్‌కు గానీ 100కు గానీ లేదా స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్‌తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382072104, 7382072106, 7382071574నకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి.
  • వీటికి తోడు సంస్థ మొబైల్ యాప్, వెబ్‌సైట్, ట్విటర్, ఫేస్‌బుక్ ద్వారా కూడా విద్యుత్ సంబంధిత సమస్యలు సంస్థ దృష్టికి తీసుకెళ్లవచ్చు.

Heavy Rains in Telangana Today : బీ అలర్ట్‌.. నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఆరెంజ్‌, ఎల్లో హెచ్చరికలు జారీ

Precautions During Rains Days : భారీ వర్షాల వేళ హైదరాబాద్‌ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాచకొండ పోలీస్ కమిషనరేట్ హెచ్చరించింది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా పలు సూచనలు చేసింది. అవేంటంటే..?

  • వర్షం కురుస్తున్నప్పుడు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దు.
  • నీటి ప్రవాహంతో ఉన్న కాలువలు, కల్వర్టులు దాటే ప్రయత్నం చేయొద్దు.
  • విద్యుత్ స్తంభాలు, పడిపోయిన విద్యుత్ లైన్లకు దూరంగా ఉండాలి.
  • చెట్ల కింద, పాత గోడలకు పక్కన ఉండకూడదు.
  • కొత్తదారిలో కాకుండా.. ఎప్పుడూ వెళ్లే దారిని మాత్రమే ఉపయోగించాలి.
  • పిల్లలను ఆడుకోవడానికి వర్షపు నీటిలోకి గానీ.. వరద సమీపంలోకి గానీ పంపొద్దు.
  • అత్యవసర సమయాల్లో 100కు డయల్ చేయాలి.

Heavy Rains in Nizamabad District : ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో విస్తారంగా వానలు.. పొంగిపొర్లుతున్న వాగులు వంకలు

Last Updated : Sep 5, 2023, 10:22 AM IST

ABOUT THE AUTHOR

...view details