తెలంగాణ

telangana

ETV Bharat / state

సాధువు మృతి.... లక్షా ఎనభై వేల నగదు స్వాధీనం - sadhuvu-dead

రాజమహేంద్రవరంలో ఓ సాధువు మృతి చెందారు. మృతదేహాన్ని తరలిస్తుండగా అతని వద్ద లక్షా ఎనభై వేల నగదు దొరికింది. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయామైనదని పోలీసులు తెలిపారు.

సాధువు మృతి.... లక్షా ఎనభై వేల నగదు స్వాధీనం

By

Published : Aug 24, 2019, 2:47 PM IST

అనాథ సాధువు మృతి చెందాడు... అతని వద్ద లక్షా ఎనభై వేల నగదు బయట పడిన ఘటన రాజమహేంద్రవరంలో తీవ్ర చర్చనీయాంశమైంది. గోదావరి గట్టున మార్కండేయ స్వామి గుడి ఎదురుగా ఈ ఘటన జరిగింది. నిత్యం వివిధ గుడుల వద్ద బిక్షాటన చేస్తూ ఉండేవాడని చుట్టు ప్రక్కలవారు తెలియచేశారు. చనిపోయిన సమాచారం అందుకున్న వన్ టౌన్ పోలీసులు.... మృత దేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో అతని వద్ద ఉన్న సంచులు తనిఖీ చేయగా డబ్బు బయటపడ్డాయి....నిర్ఘాంత పోయిన పోలీసులు ఆ నగదు లెక్కించారు. మొత్తం లక్షా ఎనభై వేల రూపాయలుగా తేల్చారు. సాధువు కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే ఆ నగదు అందిస్తామని పోలీసులు చెబుతున్నారు.

సాధువు మృతి.... లక్షా ఎనభై వేల నగదు స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details