Sadguru on green india challenge: ఎంపీ సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్‌ఛాలెంజ్ చాలా గొప్పగా ఉందని సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రశంసించారు. హరితహారం ఒక ప్రజా ఉద్యమమని ఆయన కొనియాడారు. ప్రతి ఒక్కరూ సవాల్‌గా తీసుకొని మొక్కలు నాటడం అభినందనీయం సద్గురు తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లోని అటవీ పార్క్‌లో ఎంపీ సంతోశ్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
హైదరాబాద్ అంతా పచ్చగా కనిపిస్తోంది. హరితహారం. ఇదొక ప్రజాఉద్యమం.ఎంపీ సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్‌ఛాలెంజ్ గొప్పగా ఉంది. ప్రతి ఒక్కరూ సవాల్‌గా తీసుకొని మొక్కలు నాటడం అభినందనీయం. సానుకూల దృక్పథం.. పోటీతత్వంతో ముందుకు వెళ్లాలి. భూగోళంపై పంటలు, పశుగ్రాసం, పొదలు, వృక్షాలు ఉంటేనే పచ్చదనం. ఆక్సిజన్ కోసం ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నాం.- సద్గురు జగ్గీ వాసుదేవ్