తెలంగాణ

telangana

ETV Bharat / state

సాదాబైనామాల క్రమబద్ధీకరణకు మరో పది రోజుల సమయం

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనమైన గ్రామాల్లోనూ సాదాబైనామాల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు స్వీకరించాలన్న ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. సాదాబైనామాల క్రమబద్ధీకరణ కోసం నవంబర్ 10 వరకు గడువు పొడిగిస్తూ... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులిచ్చారు.

సాదాబైనామాల క్రమబద్ధీకరణకు మరో పది రోజుల సమయం
సాదాబైనామాల క్రమబద్ధీకరణకు మరో పది రోజుల సమయం

By

Published : Oct 31, 2020, 10:35 PM IST

సాదాబైనామాల క్రమబద్ధీకరణ గడువు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ధరణి పోర్టల్ ప్రారంభం సందర్భంగా మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన మేరకు గడువు పెంచారు. క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 10 వరకు అవకాశం కల్పించారు.

అటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనమైన గ్రామాల్లోనూ సాదాబైనామాల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీ చదవండి:రైతులంతా ఏకమై పంటకు ధర నిర్ణయించుకోవాలి: కేసీఆర్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details