Sachin Tendulkar To Flag Off Half Marathon In Hyderabad 2023 : ఈనెల 5న హైదరాబాద్‌లో జరగనున్న హాఫ్ మారథాన్‌ను కిక్రెటర్ గాడ్ సచిన్ తెందూల్కర్(Sachin Tendulkar) జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ మారథాన్‌లో దాదాపు 8000 మంది రన్నర్లు పాల్గోంటారు. ఎన్ఈబీ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఈ మారథాన్‌ను మూడు విభాగాలుగా జరపనున్నారు. ఆదివారం జరిగే ఈ కార్యక్రమంలో 21.1కిలోమీటర్ల మారథాన్ ఉదయం 5:15 గంటలకు ప్రారంభం అవుతుంది. 10కే రన్ 6:30కి, 5కే రన్ ఉదయం 7గంటలకు మొదలవుతుంది.
Sachin Tendulkar on Half Marathon In Hyderabad : ఏజేస్ ఫెడరల్ దేశవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాల ద్వారా నిర్భయ భవిష్యత్తులో ఛాంపియన్‌గా చేస్తోందని ఏజియాస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాండ్ అంబాసిడర్ సచిన్ అన్నారు. ఈ ఏడాది రన్ ఏజ్‌లెస్.. రన్ ఫియర్లెస్ అనే థీమ్ అందరిలో అత్యుత్తమ ప్రయత్నాలను అందించడానికి ప్రేరేపిస్తుందని తెలిపారు.
'పరుగు విషయానికి వస్తే, చాలా మంది వ్యక్తులు తమను తాము వివిధ సవాళ్లలో ఎదుర్కొంటారన్నారు. కొంతమంది ప్రాక్టీస్ షెడ్యూల్‌లను నిర్వహించడం, కొందరు వారి ఆహారం గురించి.. మరికొందరు వారి ఫిట్నెస్ గురించి ఆందోళన చెందుతుంటారు.. కానీప్రారంభించడానికిచాలా ఆలస్యం అని ఎప్పుడూ భావించకూడదు. ఈ సంవత్సరం పాల్గొనేవారు వయస్సు గురించిన ఆలోచనలకు అతీతంగా ముందుకు వెళతారని వయస్సు కేవలం సంఖ్యకే పరిమితం చేయరని ఆశిస్తున్నాను. కేవలం యవ్వనంలో కాకుండా.. అ వయస్సులోనైనా ఫిట్నెస్ ప్రారంభించవచ్చు. భారతదేశం క్రీడలను ఇష్టపడే దేశం నుంచి క్రీడలను ఆడే దేశంగా మార్చడానికి, మాకు అన్ని వయసుల వారి భాగస్వామ్యం అవసరం'-సచిన్ తెందూల్కర్, క్రికెట్ సూపర్‌స్టార్
ఏజియాస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో విఘ్నేష్ షహానే మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా రన్నింగ్, ఫిట్నెస్ సంస్కృతిని నిర్మించడంలో తమ కంపెనీ ఎప్పుడు ముందుంటుందన్నారు. హైదరాబాద్ హాఫ్ మారథాన్ 2023కి టైటిల్ స్పాన్సర్‌గా తమ సంస్థ ఉండడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఫిట్నెస్ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు. వయస్సులో చిన్నా పెద్దా అని లేకుండా అందరినీ రన్నింగ్ చేయాలని ప్రోత్సాహిస్తున్నమన్నారు.