తెలంగాణ

telangana

ETV Bharat / state

హస్తంతో సబిత దోస్తీ వీడనుందా...? - PRAGATHI BHAVAN

కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకోనున్నట్లు వార్తలు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. తమపార్టీలోనే కొనసాగుతుందని ఉత్తమ్​కుమార్​రెడ్డి స్పష్టంచేసినా... తాజాగా కేసీఆర్​ని కలుస్తారన్న అంశంతో సబిత కారెక్కటం ఖరారైనట్లే కనిపిస్తోంది.

కారెక్కడం ఖరారేనా...?

By

Published : Mar 12, 2019, 11:29 PM IST

Updated : Mar 12, 2019, 11:51 PM IST

రేపు ప్రగతి భవన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్​ను కాంగ్రెస్​ ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కలవనున్నారు. ఇప్పటికే కేటీఆర్, కవితతో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ, ఓ పారిశ్రామిత వేత్త కీలక పాత్ర పోషించినట్లు ప్రచారం జరుగుతోంది. మహేశ్వరం నియోజకవర్గంలోని మండలాల వారీగా ముఖ్య నేతల అభిప్రాయాలను తెలుసుకున్నారు. సబితకు మంత్రి పదవి లేదా కార్తీక్ రెడ్డికి చేవెళ్ల ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు జోరందుకున్నాయి. తెరాసలో చేరుతున్నట్లు ప్రచారం జరగడంతో... రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇవీ చూడండి:రుణపడి ఉంటాం...

Last Updated : Mar 12, 2019, 11:51 PM IST

ABOUT THE AUTHOR

...view details