మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఔత్సాహిక మహిళ పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం వెన్నుతట్టి ప్రోత్సహిస్తుందని ఆమె తెలిపారు. వివిధ రంగాల్లో విజయాలు సాధించే మహిళలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో వనితలు తమవంతు పాత్ర పోషించాలని కోరారు. బేగంపేటలో మహిళ పారిశ్రామికవేత్తల సమాఖ్య నిర్వహించిన సమావేశానికి మంత్రి సబితా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెరాస నేతలు వేణుగోపాలచారి తదితరులు పాల్గొన్నారు.
మహిళల విజయాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలి: సబితా - హైదరాబాద్
వివిధ రంగాల్లో విజయాలు సాధించే మహిళలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో వనితలు తమవంతు పాత్ర పోషించాలని ఆమె కోరారు.
మహిళల విజయాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలి: సబితా
ఇవీ చూడండి: ఆర్టీసీ భవితవ్యం: త్వరలో ప్రైవేటు నోటిఫికేషన్