తెలంగాణ

telangana

ETV Bharat / state

పేదల సంక్షేమమే బీఆర్​ఎస్ లక్ష్యం: సబితా ఇంద్రారెడ్డి - తెలంగాణ తాజా వార్తలు

Sabita Indra Reddy inagurates programmes: రాష్ట్రంలో పేదల అభివృద్ధే బీఆర్​ఎస్​ ధ్యేయమని అందుకే సీఎం కేసిఆర్ పేదల సంక్షేమం కోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ , రైతుబంధు , మిషన్ భగీరథ తదితర సంక్షేమ, ఆరోగ్య పథకాలు ప్రవేశపెట్టారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్​ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు.

Sabita Indra Reddy
Sabita Indra Reddy

By

Published : Dec 23, 2022, 10:13 PM IST

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్​ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. కొత్తూరు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం షాద్‌నగర్​లో టీటీడీ కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.

అక్కడి నుంచి జిల్లేడు చౌదరగూడ మండలం జిల్లేడులో ప్రభుత్వ పాఠశాలలో ఎన్ఆర్ఐ దాత పొట్టి శ్రీనివాస్ తన తండ్రి జ్ఞాపకార్థం రూ.18 లక్షలతో నిర్మించిన రెండు తరగతి గదులు, వంట గదిని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా దాతను ఆమె అభినందించారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

దుకాణ యజమానుల సమస్యలు మంత్రి దృష్టికి: కొత్తూరు వై జంక్షన్ నుంచి షాద్​నగర్ పురపాలిక శివారులో గల సోలిపూర్ వైజంక్షన్ వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణలో భాగంగా షాద్​నగర్ పురపాలికలో భవనాలు కోల్పోతున్న యజమానులు మంత్రికి తమ గోడు వినిపించారు. విస్తరణ తగ్గించాలని, పరిహారం చెల్లించాలని మంత్రిని కోరారు. ఎన్​హెచ్​ఏఐ నిబంధనల ప్రకారం రోడ్డు విస్తరణ పనులు జరుగుతాయన్నారు. వారి నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించాలా వద్దా అనే విషయం ప్రకారం నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details