Minister Sabitha Comments on Modi : తెలంగాణ రైతులపై మోదీ ప్రభుత్వం కక్ష కట్టిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు అనుకూల విధానాలతో ముందుకెళ్తుంటే.. మోదీ మాత్రం రైతు వ్యతిరేక విధానాలతో ముందుకెళ్తున్నారని విమర్శించారు. మోదీ హయాంలో రైతుల ఆదాయం రెట్టింపు కంటే.. పెట్టుబడులు రెట్టింపయ్యాయని దుయ్యబట్టారు.
మోదీ హయాంలో రైతుల పెట్టుబడులు రెట్టింపయ్యాయి: మంత్రి సబిత - Latest news about sabita
Sabita Indra Reddy comments on Modi: మోదీ ప్రభుత్వం తెలంగాణ రైతులకు సహాయం చేయడం లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మోదీ పై ఆరోపణలు చేశారు. రైతుల సమస్యలపై కేంద్ర వైఖరి అనుకూలంగా లేదని అన్నారు. ధర్నాలు చేస్తేనే మోదీకి వినిపిస్తుందని ఎద్దేవ చేశారు.
మోడీపై సబితా ఇంద్రారెడ్డి ఆరోపణలు
రైతుల కల్లాల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా వికారాబాద్, ఇబ్రహీంపట్నం కేంద్రాల్లో పెద్దఎత్తున ఆందోళనలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ధర్నాలో రైతులంతా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మంత్రి కోరారు. ధర్నాలు చేస్తేనే మోదీకి వినిపిస్తుందని ఎద్దేవా చేశారు.
ఇవీ చదవండి: