హైదరాబాద్లో వరదలతో సర్వం కోల్పోయిన బాధితులకు మహబూబ్నగర్ సబీల్ ట్రస్ట్ అండగా నిలిచింది. సబీల్ ట్రస్ట్ ఫౌండర్, కార్యదర్శి పాతబస్తీలోని ఉప్పుగూడ శివాజీనగర్, అల్ జుబైల్ కాలనీ, అలీనగర్, బాబానగర్, రాయల్ కాలనీలో 400 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.6 వేల విలువైన కిట్ అందించారు. కిట్లో బియ్యం, పప్పులు, నూనె, సబ్బులు, వంటసామగ్రి, పాత్రలు, గిన్నెలు, బ్లాంకిట్లు, బకెట్లు ఉన్నాయి.
వరద బాధితులకు అండగా నిలిచిన సబీల్ ట్రస్ట్ - వరద బాధితులు
వరదలతో సర్వం కోల్పోయిన బాధితులకు మహబూబ్నగర్ సబీల్ ట్రస్ట్ అండగా నిలిచింది. రెండో విడతలో భాగంగా గురువారం హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్టలో 200 మంది వరద బాధితులకు... ట్రస్ట్ ఫౌండర్, కార్యదర్శి మౌలానా మొహమ్మద్ నాయీమ్ కౌసర్ రాష్షాది సరకుల కిట్, నగదు అందజేశారు.
వరద బాధితులకు అండగా నిలిచిన సబీల్ ట్రస్ట్
గురువారం హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట ఒమర్ గుల్షన్ ఫంక్షన్ హాల్లో రెండో విడతలో భాగంగా.. 200 మంది వరద బాధితులకు ఒక్కొక్కరికి రూ. 4500 సరకుల కిట్, రూ.1500 నగదు సబీల్ ట్రస్ట్ ఫౌండర్, కార్యదర్శి మౌలానా మొహమ్మద్ నాయీమ్ కౌసర్ రాష్షాది, ముఖ్యఅతిధి హుసముద్దీన్ సాని జాఫర్ పాషా అందజేశారు. వచ్చే సోమవారం మరో 200 మంది వరద బాధితులకు కిట్లు అందజేస్తామని తెలిపారు.
ఇదీ చదవండి:ధరణి.. భారతదేశానికే ట్రెండ్ సెట్టర్: సీఎం కేసీఆర్
Last Updated : Oct 29, 2020, 9:39 PM IST