తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణలో మరో భారీ సంస్థ పెట్టుబడులు..

S3V Vascular Technologies Investments in Telangana: తెలంగాణలో మరో భారీ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. వైద్య పరికరాల తయారీ సంస్థ ఎస్3వీ వ్యాస్క్యులార్ టెక్నాలజీస్ రూ.250కోట్ల పెట్టుబడితో మెడికల్ డివైజెస్ పార్క్​లో తమ తయారీ కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

S3V Vascular Technologies Investments in Telangana
తెలంగాణలో మరో భారీ సంస్థ పెట్టుబడులు..

By

Published : Mar 4, 2022, 11:48 AM IST

S3V Vascular Technologies Investments in Telangana: తెలంగాణలో మరో భారీ సంస్థ పెట్టుబడులు పెట్టనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రకటించారు. రాష్ట్రంలో వినియోగించే వైద్య పరికరాల్లో దాదాపు 78శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నవేనని... స్థానిక ఉత్పత్తులను పెంపొందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 250 ఎకరాల్లో మెడికల్ డివైజెస్ పార్క్ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో వైద్య పరికరాల తయారీ సంస్థ ఎస్3వీ వ్యాస్క్యులార్ టెక్నాలజీస్ రూ.250కోట్ల పెట్టుబడితో... మెడికల్ డివైజెస్ పార్క్​లో తమ తయారీ కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చినట్టు మంత్రి పేర్కొన్నారు.

S3V Vascular Technologies: దాదాపు 750 మందికి ఉపాధి కల్పించేలా ఎస్3వీ వ్యాస్క్యూలార్ టెక్నాలజీస్ సంస్థ ఈ కేంద్రాన్ని రూపొందిస్తోందని.... తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన వారికి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే చాలా సంస్థలు ముందుకొచ్చాయి. వారికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. మరో సంస్థ కూడా భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం వల్ల ఆనందం వ్యక్తం చేసింది.

ఇదీ చదవండి:Mirchi prices in Enumamula market : ఎర్రబంగారం రికార్డు ధర.. క్వింటా@ రూ.32 వేలు

ABOUT THE AUTHOR

...view details