తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇప్పటి వరకు రైతు ఖాతాల్లో రూ.2,955 కోట్లు జమ

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి కింద అందిస్తున్న రైతు బంధు యాసంగి సీజన్ సంబంధించి​ ఇప్పటి వరకు రూ.2,955 కోట్లు అన్నదాతల ఖాతాలో జమ చేశారు. ఈనెల 28 నుంచి నుంచి దశలవారీగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారు.

rythubandhu payments latest update
ఇప్పటి వరకు రైతు ఖాతాల్లో రూ.2,955 కోట్లు జమ

By

Published : Dec 30, 2020, 8:23 PM IST

యాసంగి సీజన్ రైతుబంధు సాయం కింద ఇప్పటి వరకు 2,955 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ సీజన్​లో 60.88 లక్షల రైతులకు కోటి 49 లక్షల 50 వేల ఎకరాలకు రైతుబంధు కింద 7,474 కోట్ల 78 లక్షల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నెల 28వ తేదీ నుంచి దశలవారీగా ఆ మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు.

బుధవారం వరకు 42.33 లక్షల మంది అన్నదాతలకు చెందిన 59.11 లక్షల ఎకరాలకు సాయం అందించినట్లు వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి తెలిపారు. 2,955.70 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. గురువారం మరో 6.40 లక్షల మంది రైతులకు చెందిన 22.48 లక్షల ఎకరాలకు 1,123.78 కోట్ల రూపాయలను జమ చేయనున్నట్లు జనార్ధన్ రెడ్డి వెల్లడించారు.

ఇదీ చదవండి:గొల్లపల్లి లొల్లిలొల్లి: తెరాస, భాజపా వివాదం.. పోలీస్‌స్టేషన్​లో ఉద్రిక్తం

ABOUT THE AUTHOR

...view details