ఈ నెల 15 నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇటీవల కాలంలో పలు బ్యాంకుల విలీనం కారణంగా ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లు మారిన రైతుల ఖాతాల్లోకి కూడా నిధులు జమ అవుతాయని స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 10 లోపు బ్యాంకు ఖాతాల వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా సేకరిస్తామని వెల్లడించారు.
జూన్ 10 లోపు మొదటిసారి పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతుల బ్యాంకు ఖాతా వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా సేకరిస్తామని మంత్రి అన్నారు. ఏమైనా సందేహాలు లేదా ఇతర వివరాల కోసం రైతులు స్థానిక ఏఈఓలను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. బ్యాంకు ఖాతా, పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు వివరాలను రైతులు వ్యవసాయాధికారులకు అందజేయాల్సి ఉంటుందని తెలిపారు.