Rythubandhu 6th day: రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం పంపిణీ కొనసాగుతోంది. 6వ రోజు రైతుబంధు కింద రూ.262.60 కోట్లు విడుదలయ్యాయి. మంగళవారం 1,49,970 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఆ నిధులు జమయ్యాయి. 5 లక్షల 25 వేల 200.21 ఎకరాల విస్తీర్ణం భూములకు నిధులు విడుదల అయ్యాయి. ఇప్పటి వరకు 51 లక్షల 50,958 మంది రైతులకు 3767.35 కోట్లు నిధులు రైతుబంధు పథకం కింద రైతుల బ్యాంకు ఖాతాల్లో వేసినట్లు మంత్రి స్పష్టం చేశారు.
ఇప్పటి వరకు రైతు ఖాతాలో జమ చేసిన డబ్బుల వివరాలు:
రోజు | విడుదల చేసిన నిధులు(రూ.కోట్లలో) |
మెుదటి రోజు | రూ.607.32 |
రెండో రోజు | రూ.1218 |
మూడో రోజు | రూ.687.89 |
నాలుగో రోజు | రూ.575 |
ఐదో రోజు | 265.18 |
ఆరో రోజు | రూ.262.60 |