తెలంగాణ

telangana

రైతు బీమా పథకం అమలు కోసం రూ.1173.54 కోట్లు విడుదల

2020-21 ఆర్థిక సంవత్సరం రైతు బీమా పథకం అమలు కోసం రూ.1173.54 కోట్ల ప్రీమియం నిధులు విడుదలయ్యాయి. 2020 ఆగస్టు 14 నుంచి 2021 ఆగస్టు 13 వరకు రైతులకు ఈ బీమా పథకం వర్తించనుంది. ఈ సొమ్ము భారతీయ బీమా సంస్థ - ఎల్ఐసీకి చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 18 నుంచి 59 ఏళ్ల వయస్సు గల 32.73 లక్షల మంది రైతులు ఈ బీమా పరిధిలోకి రానున్నారు.

By

Published : Aug 11, 2020, 4:06 AM IST

Published : Aug 11, 2020, 4:06 AM IST

rythu bheema funds released
rythu bheema funds released

రాష్ట్రంలో 2020-21 ఏడాదికి సంబంధించి రైతు బీమా పథకం ప్రీమియం నిధులు విడుదలయ్యాయి. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్థన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 18 శాతం జీఎస్టీతో కలిపి రూ. 1141 కోట్ల ప్రీమియం, రూ. 32.54 కోట్ల స్టాంప్ డ్యూటీ నిధులు విడుదల చేసింది.

బీమా పరిధిలోకి 32.73 లక్షల మంది రైతులు

2020 ఆగస్టు 14 నుంచి 2021 ఆగస్టు 13 వరకు రైతులకు ఈ బీమా పథకం వర్తించనుంది. ఈ సొమ్ము భారతీయ బీమా సంస్థ - ఎల్ఐసీకి చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 18 నుండి 59 ఏళ్ల వయస్సు గల 32.73 లక్షల మంది రైతులు ఈ బీమా పరిధిలోకి వస్తారు. ఈ ఏడాదితో 59 ఏండ్లు నిండిన రైతులు అనర్హులవుతుండగా... 18 ఏండ్లు నిండిన, కొత్తగా నమోదు చేసుకున్న దాదాపు 2 లక్షల మంది రైతులు నూతనంగా రైతు బీమా పథకం పరిధిలోకి వస్తున్నారు.

రెండేళ్లలో 32,267 కుటుంబాలకు వర్తింపు...

2018 ఆగస్టు 14న ముఖ్యమంత్రి చేతుల మీదుగా రైతు బీమా పథకం ప్రారంభించగా... రెండేళ్లలో ఎల్ఐసీకి రైతుబీమా పథకం కోసం ప్రీమియం కింద రూ. 1775.95 కోట్ల చెల్లింపులు జరిగాయి. రెండేళ్లలో ఇప్పటి వరకు 32,267 మంది రైతు కుటుంబాలకు రైతుబీమా పథకం వర్తించడంతో... ఎల్ఐసీ ద్వారా ఒక్కో రైతు కుటుంబానికి 5 లక్షల చొప్పున రూ.1613.35 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. ఈ నెల ఆగస్టు 13 వరకు గతేడాది చెల్లించిన ప్రీమియం వర్తిస్తుండగా... ఎల్ఐసీ వద్ద పరిశీలనలో ఉన్న 1800 మంది రైతుల బీమా క్లైములు కోసం ఇంకా రూ. 90 కోట్లు చెల్లించాల్సి ఉంది. రైతు ఏ కారణం చేత చనిపోయినా ఐదారు రోజుల్లో రైతు కుటుంబానికి చెందిన నామినీ పేరిట బ్యాంకు ఖాతాలో 5 లక్షలు జమ చేస్తున్న విషయం విదితమే.

ఇవీచూడండి:ఐఐటీ విద్యార్థినికి మంత్రి కేటీఆర్ చేయూత

ABOUT THE AUTHOR

...view details