రాష్ట్రంలో 58.07 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి యాసంగి రైతుబంధు నిధులు జమ అయ్యాయి. రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం పంపిణీలో భాగంగా ఇవాళ్టి వరకు 132.65 లక్షల ఎకరాలకుగాను 6632.74 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది.
శుభవార్త... ఖాతాల్లోకి రైతుబంధు నిధులు జమ
58.07 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రైతుబంధు నిధులు జమ అయ్యాయి. రైతుబంధు పథకం కింద 132.65 లక్షల ఎకరాలకు 6632.74 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయశాఖ తెలిపింది. 10 ఎకరాల విస్తీర్ణం వరకు ఉన్న రైతులందరి ఖాతాల్లోకి నేరుగా జమచేసింది.
ఖాతాల్లోకి రైతుబంధు నిధులు జమ
10 ఎకరాల విస్తీర్ణం వరకు ఉన్న రైతులందరి ఖాతాల్లోకి నేరుగా నిధులు జమచేసింది. అన్నంపెట్టే రైతులు ఆనందంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి ఆకాంక్ష అన్న వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి... కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు సాయం అందించామని గుర్తుచేశారు. మరో మూడు, నాలుగు రోజుల్లో మిగిలిన రైతుల ఖాతాల్లోకి నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర రైతాంగం పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.