rythu bandhu funds : యాసంగిలో పంటల పెట్టుబడి సాయం కోసం రైతులకు ఇవాళ్టి నుంచి రైతుబంధు చెల్లింపులు జరగనున్నాయి. ఈ సీజన్ పంట సాగు కోసం ఎకరాకు ఐదు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించనుంది. రైతుబంధు చెల్లింపుల కోసం డిసెంబర్ పదో తేదీని కటాఫ్ తారీఖుగా నిర్ణయించారు. ఆ రోజు వరకు ధరణి పోర్టల్ నందు ఉన్న వ్యవసాయ భూముల పట్టాదారులు, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అటవీ హక్కుల పరిరక్షణ చట్టం కింద పట్టాలు పొందిన వారికి ఈ సీజన్లో పంట పెట్టుబడి సాయం అందనుంది.
ఎకరాకు రూ.5వేల చొప్పున..
94 వేల మందికి చెందిన ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల ప్రకారం ఉన్న 3.05 లక్షల ఎకరాలకు కూడా రైతుబంధు సాయం ఇస్తారు. మొత్తంగా ఈ సీజన్లో 66.61 లక్షల మంది రైతులుకు చెందిన కోటి 52 లక్షల 91 వేల ఎకరాలకు సాయం అందిస్తారు. ఎకరాకు ఐదు వేల రూపాయల చొప్పున 7,645 కోట్ల 66 లక్షల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఈ ఏడాది వానాకాలం సీజన్లో 61.08 లక్షల మందికి 7,377 కోట్ల రూపాయలు రైతుబంధు సాయంగా అందించారు. యాసంగి సీజన్లో లబ్ధిదారుల సంఖ్య 66.61 లక్షలకు పెరిగింది. వారికి రూ.7,645 కోట్లకు పైగా సాయం అందనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇవాళ్టి నుంచి యాసంగి సీజన్ రైతుబంధు చెల్లింపులు చేస్తారు.
ఒక్కో ఎకరా పెంచుకుంటూ ఆరోహణ క్రమంలో..