రాష్ట్రంలో రైతు బంధు(Rythu Bandhu) పథకం కింద రైతులకు పెట్టుబడి రాయితీ సాయం పంపిణీ కొనసాగుతోంది. ఈ ఏడాది వానా కాలానికి సంబంధించి గురువారం... తొమ్మిదో రోజు 30 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో సాయం జమ అవుతోంది.
ఇవాళ 18 వేల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 2.40 లక్షల ఎకరాలు సంబంధించి 120.16 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 60.75 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం 7,298.83 కోట్ల రూపాయలు జమ చేసింది.