తెలంగాణ

telangana

By

Published : Jun 25, 2021, 5:12 AM IST

ETV Bharat / state

నేటితో పూర్తి కానున్న వానాకాలం రైతుబంధు సాయం పంపిణీ

వానాకాలం రైతుబంధు సాయం పంపిణీ ఇవాళ్టితో పూర్తి కానుంది. ఈనెల 15వ తేదీ నుంచి తక్కువ విస్తీర్ణం ఉన్న వారితో పంపిణీ ప్రారంభించారు. నిన్నటి వరకు 30 ఎకరాలలోపు ఉన్న వారికి రైతుబంధు సాయం అందించారు.

Rythu bandh
రైతుబంధు

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతు బంధు సాయం పంపిణీ వానాకాలానికి సంబంధించి నేటితో ముగియనుంది. ఈనెల 15వ తేదీ నుంచి తక్కువ విస్తీర్ణం ఉన్న వారితో ప్రారంభించి, పెట్టుబడి సాయం పంపిణీని రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. నిన్నటి వరకు 30 ఎకరాలలోపు ఉన్న వారికి రైతుబంధు సాయం అందించారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 60,74,973 మంది రైతులకు 7,298 కోట్లా 83 లక్షల రూపాయలను ప్రభుత్వం అందించింది.

ఇప్పటివరకు కోటీ 45 లక్షలా 98 వేల ఎకరాలకు రైతుబంధు సాయం అందించారు. 30 ఎకరాల పైబడి ఉన్న వారందరికీ చివరి రోజైన ఇవాళ రైతుబంధు సాయం అందనుంది. మొత్తం 63,25,695 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. మొత్తంగా కోటీ 50 లక్షలా 18 వేల ఎకరాలకు 7508 కోట్లా78 లక్షల రూపాయలు అవసరమవుతాయని తేల్చారు. కరోనా కష్టకాలంలోనూ ఆర్థికఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు సాయం అందించాల్సిందేనని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా రుణాల ద్వారా నిధులను సమీకరించి రైతుబంధు సాయాన్ని అందించారు. ప్రభుత్వం తరఫున ఇతర చెల్లింపులను కూడా కొన్నాళ్లపాటు ఆపివేశారు.

ఇదీ చదవండి:Door Curtain: బాలుడి మెడకు చుట్టుకున్న డోర్​ కర్టెన్​

ABOUT THE AUTHOR

...view details