Rush in Railway Stations: కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా రైల్వే శాఖ అప్రమత్తమైంది. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారిపై రైల్వే శాఖ దృష్టిసారించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. రైల్వే పరిసరాల్లో తప్పక మాస్కులు ధరించాలని... లేకుంటే రూ. 500 వరకు అపరాధ రుసుము విధిస్తామని స్పష్టం చేసింది. రైల్వే స్టేషన్ పరిసరాల్లో అధికారులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఇప్పటివరకు 169 కేసులు నమోదుతో పాటు 34 వేల జరిమానా వసూలు చేశారు.
ప్లాట్‌ఫారాల మార్పు...
సంక్రాంతి రద్దీ దృష్ట్యా జనవరి 12 నుంచి 21 వరకు మూడు రైళ్ల ప్లాట్‌ఫారాలను తాత్కాలికంగా మార్చారు. ఒకటో నంబర్ ప్లాట్ ఫారం నుంచి బయలుదేరే గోదావరి ఎక్స్‌ప్రెస్, గౌతమి ఎక్స్‌ప్రెస్‌లు పదో ప్లాట్‌ఫారానికి మార్చారు. పదో నంబర్ ప్లాట్ ఫారం నుంచి బయలుదేరే హజ్రత్ నిజాముద్దీన్-బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫారం నంబర్ ఒకటి నుంచి బయలుదేరనుంది. ప్రయాణికుల రద్దీని నియంత్రించడానికి వారి రైలు బయలుదేరే రెండు గంటల ముందుగా మాత్రమే స్టేషన్‌లోని అనుమతించనున్నారు.
వాళ్లే లోపలికి...