మృగశిర కార్తెను పురస్కరించుకొని హైదరాబాద్లోని ముషీరాబాద్ చేపల మార్కెట్‌లో భారీ రద్దీ నెలకొంది. పలు ప్రాంతాల నుంచి తరలి వచ్చిన కొనుగోలుదారులతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసి పోయింది. డిమాండ్ దృష్ట్యా చేపల ధరలు భగ్గుమన్నాయి. సాధారణంగా కిలో రూ. 600 అమ్మే కొర్రమీను రూ. 800 పలికింది. రవ్వ తదితర చేపలు కిలో రూ. 100 ఉండగా నేడు రూ. 200కు విక్రయించారు. నేడు ఒక్కరోజే ఏపీ నుంచి దిగుమతి అయిన సుమారు 300 క్వింటాళ్ల చేపల అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది.
ముషీరాబాద్ చేపల మార్కెట్‌లో భారీ రద్దీ
హైదరాబాద్లోని పలు చేపల మార్కెట్లలో ఇవాళ తీవ్ర రద్దీ నెలకొంది. మృగశిర కార్తె కావడంతో ముషీరాబాద్ మార్కెట్‌కు కొనుగోలుదారులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. భౌతిక దూరం పాటించని పలువురిపై పోలీసులు జరిమానా విధించారు.
Fish market
కరోనా రెండో దశ విజృంభణ కొనసాగుతోన్నా.. నేడు చేపలు తింటే శక్తిని పెంపొందిస్తాయనే విశ్వాసంతో ప్రజలు భౌతిక దూరం వంటి నియమాలు కూడా పాటించకుండా మార్కెట్‌కు ఎగబడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు మార్కెట్‌కు చేరుకుని నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధించారు.
ఇదీ చదవండి:లాక్డౌన్లో విధించిన జరిమానాలు రద్దు చేయండి: నిరంజన్