తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్తపల్లి జలపాతం.. ప్రకృతి అందాల ప్రపంచం - news at kothapalli waterfalls

ఏపీలోని విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం జి.మాడుగుల మండలంలోని ప్రకృతి అందం... కొత్తపల్లి జలపాతం.. పర్యటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. జలపాతం అందాలను తిలకించేందుకు దూర ప్రాంతాల నుంచి చాలామంది నిత్యం తరలివస్తున్నారు.

కొత్తపల్లి జలపాతం.. ప్రకృతి అందాల ప్రపంచం

By

Published : Nov 18, 2019, 11:20 PM IST

కనుచూపు మేరంతా పచ్చదనం... మధ్యలో చూడచక్కని జలపాతం. ఇదీ... ఏపీలోని విశాఖపట్నం జిల్లా జి.మాడుగుల మండలంలో ఉన్న కొత్తపల్లి జలపాతం. హొయలుపోతున్న ఈ ప్రకృతి అందాన్ని చూసేందుకు దూర ప్రాంతాల నుంచి పర్యటకులు పెద్ద సంఖ్యలో వచ్చి సందడి చేశారు. చిన్నా పెద్దా తేడా లేకుండా... జలపాతంలో తడుస్తూ సందడి చేశారు. జలపాత అందాలు కెమెరాల్లో బంధిచేందుకు ఉత్సాహం చూపించారు. సెల్ఫీలతో యువతీ యువకులు హంగామా చేశారు.

కొత్తపల్లి జలపాతం.. ప్రకృతి అందాల ప్రపంచం

ABOUT THE AUTHOR

...view details