గ్రామీణ భారత అభివృద్ధే లక్ష్యంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ పథకం తీసుకొచ్చినట్లు కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. దిల్లీలోని అంబేడ్కర్ ఇంటర్ నేషనల్ సెంటర్లో జరిగిన ఎస్పీఎం రూర్బన్ మిషన్ 4వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
"గ్రామీణ భారత అభివృద్ధే.. రూర్బన్ మిషన్ పథకం లక్ష్యం" - శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ పథకం
దిల్లీలోని అంబేడ్కర్ ఇంటర్ నేషనల్ సెంటర్లో జరిగిన ఎస్పీఎం రూర్బన్ మిషన్ 4వ వార్షికోత్సవంలో కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రధాని మోదీ నేతృత్వంలో అనేక పథకాలు వస్తున్నాయని తెలిపారు.
"గ్రామీణ భారత అభివృద్ధే.. రూర్బన్ మిషన్ పథకం లక్ష్యం"
గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రధాని మోదీ నేతృత్వంలో అనేక పథకాలు వస్తున్నాయని.. క్లస్టర్లుగా విభజించి అభివృద్ధి సాధనలో రూర్బన్ మిషన్ విజయవంతం అవుతోందని కేంద్రమంత్రి తోమర్ పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషికి ప్రజల సహకారంతో గ్రామాలు అభివృద్ధి పథంలో నడవాలని సూచించారు. కార్యక్రమంలో రూర్బన్ మిషన్ విజయాలను ఆయా ప్రాంతాల అధికారులు వివరించారు.
ఇవీ చూడండి:పట్టణ ప్రగతిలో అందరూ భాగస్వాములవ్వాలి: సీఎస్