తెలంగాణ

telangana

ETV Bharat / state

నడుస్తున్న కారులో శబ్దం.. చేలరేగిన మంటలు - చింతల్ వద్ద కారులో మంటలు

రోడ్డుపై నడుస్తున్న కారు ముందు భాగం నుంచి ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది.. అప్రమత్తమైన డ్రైవర్​ వెంటనే కారును రోడ్డు పక్కకు ఆపాడు. కారు ఇంజిన్​లో నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అందులో ఉన్న ప్రయాణికులు హూటాహుటిన దిగిపోయారు. ఈ ఘటన జీడిమెట్ల పీఎస్ పరిధి చింతల్లో ఆదివారం చోటుచేసుకుంది.

running-car-suddenly-big-noise-and-flames-reached-engine
నడుస్తున్న కారులో శబ్దం.. చేలరేగిన మంటలు

By

Published : May 24, 2020, 11:10 PM IST

Updated : May 25, 2020, 3:50 PM IST

జీడిమెట్ల పీఎస్ పరిధి చింతల్లో ఆదివారం ఊబర్ క్యాబ్-ఇండికా కారు ఇంజిన్ నుంచి ప్రమాదవశాత్తు మంటలు చేలరేగాయి. ఆ మంటలతో ఇంజిన్ మొత్తం కాలిపోయింది. బాలనగర్ నుంచి చింతల్ వైపు ముగ్గురు ప్యాసెంజర్స్​తో వెళ్తున్న (టీఎస్​13యూఏ8661) ఇండికా కారు చింతల్ పెట్రోల్ బంక్ వద్దకు రాగానే ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన డైవర్​ కారును రోడ్డు పక్కకు ఆపి, బ్యానెట్ ఓపెన్ చేశాడు.

నడుస్తున్న కారులో శబ్దం.. చేలరేగిన మంటలు

అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకట్ పక్కనే ఉన్న పెట్రోల్ బంక్​ నుంచి నీరు, సీజ్ ఫైర్ తెచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తు కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు, కారు డ్రైవరు భరత్ సురక్షితంగా బయటపడ్డారు. లాక్​డౌన్ సమయంలో ఎక్కువ రోజులు కారు‌ నిలిపివేయడం వల్ల ఎలుకలు ఏసీ గ్యాస్ పైపును కొరికి ఉంటాయని.. ఆ కారణంగా గ్యాస్ లీకై టర్బో లోకి వెళ్లి ఇంజిన్ నుంచి మంటలు వచ్చే అవకాశం ఉందని పోలీసులు, కారు డ్రైవర్ భావిస్తున్నారు.

ఇదీ చూడండి :గొర్రెకుంట బావి మృతదేహాల ఘటనలో వీడిన మిస్టరీ

Last Updated : May 25, 2020, 3:50 PM IST

ABOUT THE AUTHOR

...view details