తెలంగాణ

telangana

ETV Bharat / state

Groom runaway: ప్రేమించి పెళ్లాడాలనుకున్నాడు.. ముహూర్తం సమయానికి జంప్ అయ్యాడు.. కట్ చేస్తే - హైదరాబాద్ వార్తలు

Runaway Groom in Medchal : వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఆర్యసమాజ్​లో పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ విషయం కాస్త వారి ఇళ్లల్లో తెలిసింది. ఇరు కుటుంబాల తల్లిదండ్రులు వారి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో మళ్లీ పెళ్లికి ఏర్పాట్లు చేశారు. ప్రాణంగా ప్రేమించిన వాడితో పెళ్లి జరుగుతుందని ఆ వధువు ఎంతో సంబురపడింది. కాసేపట్లో పెళ్లి ముహుర్తం.. ఇంతలో వరుడు షాకిచ్చాడు. అసలు ఏమైందంటే..!

Groom Shock
Groom Shock

By

Published : May 4, 2023, 11:35 AM IST

Runaway Groom in Medchal : రెండు అక్షరాల ప్రేమ మనిషిని అన్ని దూరం చేసుకునేలాగా చేస్తుంది. ప్రేమలో పడితే నా అనుకున్న వాళ్లను కూడా మర్చిపోయి.. కాదని చెప్పి వెళ్లిపోతుంటారు. 'ప్రేమ'.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పదం వినిపిస్తూనే ఉంటుంది. కనిపెంచిన తల్లిదండ్రులను ఒక్క క్షణం కూడా గుర్తుచేసుకోకుండా ప్రేమించిన వాడితో వెళ్లిపోవడం.. అలాగే ప్రేమించి పెళ్లి చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇలా ప్రేమించిన వారి కోసం, ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుని కన్న తల్లిదండ్రులకు శోకాన్ని మిగులుస్తున్నారు.

Groom Shocked In Jeedimetla: కొంతమంది తల్లిదండ్రులను వదిలి వెళ్లలేక, ప్రేమను కాదనలేక ఇంట్లో ఒప్పించే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి ఘటనే జీడిమెట్లలోని పోలీస్​ స్టేషన్​ పరిధిలో చేటుచేసుకుంది. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం.. వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఇద్దరి ఇష్టపూర్వకంగానే ఆర్యసమాజ్‌లో పెళ్లి కూడా చేసుకున్నారు. ఇంట్లో పెద్దలను ఒప్పించి బంధుమిత్రుల సాక్షిగా మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అలాగే వారి ప్రేమ గురించి ఇంట్లో చెప్పి ఒప్పించుకున్నారు.

ఇరు కుటుంబాలు పెళ్లికి గ్రీన్ సిగ్నల్: పిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడమని ఇరువురి కుటుంబ సభ్యులు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రేమించిన వాడితో పెళ్లి జరుగుతుందని ఆ వధువు ఎంతో సంతోష పడింది. ఆ సంతోషం వధువుకు ఎంతో సేపు లేకుండా పోయింది. మరికొన్ని గంటల్లో పెళ్లి ఉందనగా వరుడు అదృశ్యమయ్యాడు. దీంతో రాత్రి 11 గంటలకు పెళ్లి దుస్తులతో వధువు జీడిమెట్ల పోలీసుల్ని ఆశ్రయించాల్సి వచ్చింది. చివరకు ఏమైందంటే..?

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. కుత్బుల్లాపూర్‌ కుర్మబస్తీకి చెందిన యువతి అదే బస్తీలో ఉంటున్న యువకుడిని ప్రేమించింది. ఇరువురు పెద్దలకు తెలియకుండా ఫిబ్రవరి 19వ తేదీన అల్వాల్‌లోని ఆర్యసమాజ్‌లో స్నేహితుల సమక్షంలో పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ పెళ్లి విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో వారి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకొని బుధవారం పెళ్లి ముహూర్తం నిశ్చయించారు.

అయితే మంగళవారం రాత్రి నుంచే యువకుడి ఫోన్‌ స్విఛ్ ​ఆఫ్​ వచ్చింది. వరుడు కేసం.. స్నేహితులు, తెలిసిన వారి దగ్గర కుటుంబసభ్యులు విచారించారు. అయినా అతని ఆచూకీ ఎక్కడా లభించకపోవడంతో రాత్రి 11 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఇన్‌స్పెక్టర్‌ 4 గంటల్లో యువకుడి ఆచూకీ గుర్తించి, అతనితో మాట్లాడి కౌన్సెలింగ్‌ చేశారు. కుటుంబసభ్యులు పెట్టుకున్న ముహూర్తానికే పెళ్లి జరగడంతో స్థానికులు పోలీసులను అభినందించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details