తెలంగాణ

telangana

ETV Bharat / state

సమస్యలు పరిష్కరించాలంటూ టీఎంయూ ధర్నా

ఆర్టీసీ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఆందోళన బాట పట్టింది. ఇందిరాపార్కులోని ధర్నాచౌక్ వద్ద హైదరాబాద్, రంగారెడ్డి అర్బన్ జోన్ ఆధ్వర్యంలో మహిళా కార్మికులు రిలే నిరాహార దీక్ష చేశారు.

సమస్యలు పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికుల ధర్నా

By

Published : Jul 24, 2019, 9:19 PM IST

ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మికులు నిరసన చేపట్టారు. పెడింగ్​లో ఉన్న జీతభత్యాలను వెంటనే చెల్లించాలని, మహిళా కండక్టర్లకు డిపోల్లో మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్​ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ, టీఎమ్​యూ పిలుపుపై ఇందిరాపార్క్​లోని ధర్నాచౌక్​ వద్ద రిలే నిరాహార దీక్ష చేశారు. డ్రైవర్, కండక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని టీఎంయూ సిటీ జోనల్ అధ్యక్షుడు వెంకటేశం డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాన్యం తన వైఖరి మార్చుకోవాలని కోరారు.

సమస్యలు పరిష్కరించాలంటూ టీఎంయూ ధర్నా
ఇదీ చూడండి: గోదావరిఖనిలో టీఎంయూ రిలే నిరాహార దీక్షలు

ABOUT THE AUTHOR

...view details