జీతాల కోసం నెలనెలా ఆర్టీసీ కార్మికులకు ఎదురుచూపులు తప్పడంలేదు. 12వ తేదీ వచ్చినా తమకు వేతనాలు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న తమకు సకాలంలో జీతాలు అందించాలని ప్రభుత్వానికి తెలంగాణ మజ్దూర్ యూనియన్ విజ్ఞప్తి చేసింది. కరోనాకు ముందు ఆర్టీసీకి రోజూ 11 నుంచి 13 కోట్ల ఆదాయం వచ్చేదని... ప్రస్తుతం 3 నుంచి 4 కోట్లు కూడా దాటడంలేదని తెలిపారు.
RTC: జీతాల కోసం ఎదురుచూస్తున్న ఆర్టీసీ కార్మికులు
ఆర్టీసీ కార్మికులకు కష్టాలు తప్పడం లేదు. ప్రతి నెలా జీతాల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. 12వ తేదీ వచ్చినా జీతాలు ఇంకా అందడం లేదని వారు వాపోతున్నారు. కరోనా కష్టకాలంలో సకాలంలో జీతాలు అందించాలని ప్రభుత్వానికి తెలంగాణ మజ్దూర్ యూనియన్ విజ్ఞప్తి చేసింది.
జీతాల కోసం ఎదురుచూస్తున్న ఆర్టీసీ కార్మికులు
కరోనా తొలిదశలోనూ ఆదాయం తగ్గడంతో ప్రభుత్వం నిధులు విడుదల చేశాకే జీతాలు చెల్లించారని... ప్రస్తుతం అదే పరిస్థితి నెలకొందని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఇకనుంచైనా జీతాలు సకాలంలో అందించేలా చర్యలు తీసుకోవాలని టీఎంయూ నేతలు యాజమాన్యాన్ని కోరారు.
ఇదీ చదవండి:చీఫ్ జస్టిస్ను కలిసిన సీఎం కేసీఆర్