ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం విషయంలో యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా అన్ని కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు జారీ చేశాయి. హైదరాబాద్ బస్‌భవన్‌లోని ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్వరరావుకు ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు సమ్మె నోటీసు అందజేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అక్రమంగా తిరుగుతున్న ప్రైవేటు బస్సులను నియంత్రించాలని కోరారు. కార్మికుల సమస్యల పరిష్కార విషయంలో ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని... అందుకే సమ్మె నోటీసు ఇచ్చామని కార్మిక సంఘం నేతలు పేర్కొన్నారు.
ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలి: ఆర్టీసీ కార్మిక సంఘం
హైదరాబాద్ బస్‌భవన్‌లో ఆర్టీసీ కార్మిక సంఘాలు యాజమాన్యానికి సమ్మె నోటీసులు జారీ చేశాయి. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని... సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశాయి.
ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలి: ఆర్టీసీ కార్మిక సంఘం