'ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం' అని ప్రతి బస్సు వెనకాల రాసి ఉంటుంది. అందుకు అనుగుణంగా మన ప్రజా రవాణా వ్యవస్థ పని చేస్తోంది కూడా. అదేవిధంగా మహిళల భద్రత విషయంలో మరో అడుగు ముందుకేసింది. రాత్రి సమయంలో ఎక్కైడైనా బస్సులు ఆపేలా వారికి సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.
వారి భద్రత దృష్ట్యా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఆర్టీసీ అధికారులు. రాజధాని నగరంలో ఉద్యోగరీత్యా కార్యాలయాలకు వెళ్లి వచ్చే మహిళల కోసం ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. గ్రేటర్ పరిధిలో ఎక్కడా చేయి ఎత్తినా అక్కడ బస్సు ఆపేలా ఆదేశాలు జారీ చేశారు అధికారులు. అదేవిధంగా వారు కోరిన చోట బస్సు దిగేలా సదుపాయాన్ని కల్పించారు. రాత్రి సమయంలో 7.30 తర్వాత మహిళల కోసం నగరంలో ఎక్కడైనా బస్సు ఆపాల్సిందేనని గ్రేటర్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు ప్రకటించారు.