తెలంగాణ

telangana

ETV Bharat / state

సమ్మెలో కార్మికలోకం... సర్కారు చర్చల సంకేతం! - ts rtc strick in hyderabad

ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలతో ఆర్టీసీ కార్మికుల సమ్మె మరింత తీవ్రతరమవుతోంది. శ్రీనివాసరెడ్డి, సురేందర్ బలిదానాలతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. ఓ వైపు చర్చల కోసం ప్రభుత్వం సంకేతాలు పంపడం, ఆర్టీసీ జేఏసీ సైతం దీనికి సై అనడంతో సమ్మె ఓ కొలిక్కివచ్చే అవకాశం కనిపిస్తోంది. కార్మికలోకం మాత్రం పదకొండో రోజు నిరసనలు తెలుపుతోంది.

11వ రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె

By

Published : Oct 15, 2019, 10:11 AM IST

Updated : Oct 15, 2019, 10:30 AM IST

11వ రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె

రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రశాంతంగా కొనసాగుతోంది. బలవన్మరణానికి పాల్పడిన శ్రీనివాస్‌రెడ్డి, సురేందర్‌గౌడ్‌లకు సంతాపంగా.. కార్మికులు నిరసనలు తెలుపుతున్నారు. వివిధ సంఘాలు.. సమ్మెకు మద్దతు తెలుపుతూ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి.

ఇవాళ రాస్తారోకోలు, మానవహారాలు...

డిపోల ముందు నినాదాలు.. బైఠాయింపులు.. ఆందోళనలతో ఆర్టీసీ కార్మికుల సమ్మె 11వ రోజుకు చేరింది. రోజుకో రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులు నేడు మానవహారాలు, రాస్తోరోకోలు చేయనున్నారు. నిన్న డిపోల ముందు సంతాప సభలు, బైఠాయింపులతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. సమ్మెకు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి.

సర్కారు చర్చల సంకేతం...

కేసీఆర్​ ఆదేశిస్తే కార్మికులతో చర్చిస్తానని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు చెబుతున్నారు. కేకే మధ్యవర్థిత్వంలో చర్చలకు సిద్ధమని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. కానీ ఇప్పటివరకూ ప్రభత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. తాత్కాలిక సిబ్బంది అనుభవలేమితో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆర్టీసీ ప్రయాణం చేయడానికి ప్రజలు భయపడుతున్నారు. ఈక్రమంలో సమ్మెపై చర్చల గురించి సర్వత్రా ఆసక్తి కలుగుతోంది.

ఇదీ చూడండి: ఆత్మహత్యకు యత్నించిన ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి మృతి

Last Updated : Oct 15, 2019, 10:30 AM IST

ABOUT THE AUTHOR

...view details