ఉద్ధృతంగా సాగుతున్న ఆర్టీసీ సమ్మె సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 12వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ ఐకాసకు మద్దతుగా నేడు విద్యార్థులు ర్యాలీలు తీయనున్నారు. కార్మికులు నిన్న రాస్తారోకోలు, మానవహారాలు చేపట్టారు. వీరి నిరసన కొన్నిచోట్ల ఉద్రిక్తతలకు దారి తీసింది. ప్రభుత్వం, కార్మిక సంఘాలు పట్టు వీడి చర్చలు జరపాలని హైకోర్టు సూచించింది.
పెరుగుతున్న మద్దతు..
మరోవైపు ఆర్టీసీ సమ్మెకు మద్దతు పెరుగుతోంది. సమ్మెకు టీఎన్జీవోలు మద్దతు ప్రకటించారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస తెలిపింది. ఈనెల 19లోగా సమస్యలను పరిష్కరించకపోతే 21న ప్రగతిభవన్ ముట్టడిస్తామని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ఈనెల 19న జరిగే రాష్ట్రబంద్‌కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని ప్రకటించారు.
ఇదీ చూడండి: సమ్మెలో కార్మికలోకం... సర్కారు చర్చల సంకేతం!