తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఉద్యోగ భద్రత కావాలి.. ఎంవీ యాక్ట్‌లోని సెక్షన్లు అమలు చేయాలి'

ఉద్యోగులను తీసేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీఎస్.రావు ఆరోపించారు. ఉద్యోగ భద్రతకు ఎంవీ యాక్ట్‌లోని సెక్షన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 24న డిమాండ్ బ్యాడ్జీలతో విధులకు హాజరు కావాలన్నారు.

RTC Staff and Workers Federation State Conference
ఉద్యోగ భద్రతకు ఎస్‌డబ్ల్యూఎఫ్ డిమాండ్

By

Published : Feb 21, 2021, 8:37 AM IST

ఉద్యోగ భద్రత కావాలని కోరుతుంటే.. యాజమాన్యం మాత్రం తమను ఏవిధంగా తీసేయాలని ఆలోచిస్తోందని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీఎస్.రావు ఆరోపించారు. కార్మికులు కోరుకుంటున్న సంపూర్ణ ఉద్యోగ భద్రత కోసం ఎంవీ యాక్ట్‌లోని పలు సెక్షన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

కార్మిక సంఘం ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల 'ఉద్యోగ భద్రత-తీసుకోవాల్సిన చర్యలు' అనే అంశంపై రాష్ట్ర సదస్సు నిర్వహించారు. కార్యక్రమాన్ని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి సాయిబాబు ప్రారంభించారు.

ఎంవీ యాక్ట్‌లోని పలు సెక్షన్లపై ఎస్‌డబ్ల్యూఎఫ్ బృందం అధ్యయనం చేసిందని తెలిపారు. ఈనెల 24న డిమాండ్ బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని కోరారు. 27 న బ్యాలెట్ నిర్వహించాలన్నారు. జిల్లా, డిపో స్థాయిలో ఆత్మీయ సమ్మేళనాలు జరపాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ఇంటి నుంచి పని... ఇంకెన్నాళ్లని..!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details