తెలంగాణ

telangana

ETV Bharat / state

మేడారం జాతరకు వేళాయే.. హైదరాబాద్​ నుంచి ప్రత్యేక బస్సులు - తెలంగాణ వార్తలు

RTC Special buses to Medaram jatara : తెలంగాణ కుంభమేళగా పేరుపొందిన మేడారం మహా జాతర సమీపిస్తోంది. వనంలో ఉన్న దేవతలు జనంలోకివచ్చి నీరాజనాలు అందుకునే శుభ ముహూర్తం దగ్గరపడింది. ఫిబ్రవరి 16 నుంచి 18 వరకు జాతర జరగనుంది. ఈ జాతర కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు నిర్ణయించింది. హైదరాబాద్ నుంచి కూడా స్పెషల్ బస్సుల సేవలు అందుబాటులోకి రానున్నాయి.

RTC Special buses to Medaram jatara, medaram special bus
మేడారం జాతరకు వేళాయే.. హైదరాబాద్​ నుంచి ప్రత్యేక బస్సులు

By

Published : Jan 11, 2022, 3:31 PM IST

RTC Special buses to Medaram jatara : మేడారం జాతర సమీపిస్తోంది. ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరిగే ఈ మహాజాతర కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపడానికి నిర్ణయించింది. హైదరాబాద్​ నుంచి మేడారం స్పెషల్ బస్సు సేవలు ఈనెల 16 నుంచి అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఎంజీబీఎస్ నుంచి ఈ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆయన వెల్లడించారు.

బస్సుల వివరాలు

హైదరాబాద్ డిపో-1 సూపర్ లగ్జరీ బస్సులు... ఎంజీబీఎస్ నుంచి ఉదయం 6 గంటలకు స్టార్ట్ అవుతాయని పేర్కొన్నారు. మేడారం నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరుతాయని వెల్లడించారు. హైదరాబాద్ -2 డిపో బస్సులు ఎంజీబీఎస్ నుంచి ఉదయం 7 గంటలకు... మేడారం నుంచి సాయంత్రం 4 గంటలకు బయల్దేరుతాయని చెప్పారు. పికెట్ డిపో బస్సులు ఎంజీబీఎస్ నుంచి ఉదయం 8 గంటలకు... మేడారం నుంచి సాయంత్రం 5 గంటలకు బయలుదేరుతాయని తెలిపారు.

బుక్ చేసుకునే వెసలుబాటు

ప్రజల సౌకర్యార్థం tsrtconline.in వెబ్ సైట్​లో, టీఎస్ఆర్టీసీ యాప్​లో బస్సులను బుక్ చేసుకునే వెసలుబాటు కల్పించామన్నారు. మేడారం ప్రత్యేక బస్సులకు రూ.398లు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:Medaram Jatara 2022: వనదేవతల పండుగ.. మేడారం మహా జాతరకు ముమ్మర ఏర్పాట్లు

ABOUT THE AUTHOR

...view details