తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి' - ఉద్ధృతం

సికింద్రాబాద్​లోని జూబ్లీ బస్ స్టేషన్​లో తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ధర్నా చేపట్టింది. ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని ఆ సంఘం అధ్యక్షుడు హెచ్చరించారు.

అర్హులైన ఉద్యోగులకు వెంటనే పదోన్నతులు ఇవ్వాలి : ఆర్టీసీ ఈయూ అధ్యక్షుడు

By

Published : Jul 12, 2019, 9:10 PM IST

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ ఆర్టీసీ ఈయూ సంఘం సికింద్రాబాద్ జేబీఎస్ వద్ద ధర్నాకు దిగింది. గత మూడు ఏళ్ల నుంచి ఏ ఒక్క సమస్య పరిష్కరించలేదని ఆ సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఔట్​సోర్సింగ్, విరమణ చెందిన ఉద్యోగుల స్థానంలో కొత్త నియామకాలు చేపట్టకుండా కార్మికులపైనే పని భారం మోపుతున్నారని మండిపడ్డారు.
రాయితీలను సకాలంలో ఇవ్వకపోవడం, బడ్జెట్​లో నిధులు సరిగ్గా కేటాయించకపోవడం తదితర కారణాల వల్లే ఆర్టీసీకి తీవ్ర నష్టం జరిగిందన్నారు. అర్హులైన ఉద్యోగులకు వెంటనే పదోన్నతులు ఇవ్వాలని.. ఖాళీల కోసం నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తాం : ఆర్టీసీ ఈయూ

ABOUT THE AUTHOR

...view details