ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, వేతన సవరణను అమలు చేయాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ నెల 27వ తేదీన కార్మికుల సమస్యలపై నిర్వహించనున్న కార్యక్రమం గోడ పత్రికను హైదరాబాద్ విద్యానగర్లో యూనియన్ నాయకులు ఆవిష్కరించారు. ఆర్టీసీలో కాంట్రాక్టు, చెకింగ్ అధికారుల వేధింపులు పెరిగాయని ఆయన ఆరోపించారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోని పక్షంలో తమ ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని రాజిరెడ్డి హెచ్చరించారు.
'ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి' - "ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి"
ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 27న నిర్వహించనున్న కార్యక్రమం గోడపత్రికను విడుదల చేశారు.

"ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి"