తెలంగాణ

telangana

ETV Bharat / state

RTC MD Sajjanar: 'ప్రైవేటు వాహనాలు వద్దు.. ఆర్టీసీ బస్సుల్లోనే సురక్షిత ప్రయాణం' - sajjanar on sankranthi buses

RTC MD Sajjanar: పెరుగుతున్న కరోనా కేసులు దృష్టిలో పెట్టుకుని బస్సు ప్రయాణాలకు అన్ని ఏర్పాట్లు చేశామని టీఎస్​ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇప్పటివరకు 20 లక్షల మందిని సొంతూళ్లకు క్షేమంగా చేర్చినట్లు వెల్లడించారు. ఈ మేరకు హైదరాబాద్​ ఎంజీబీఎస్​కు వెళ్లిన సజ్జనార్​.. ప్రయాణికుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

rtc md sajjanar
ఆర్టీసీ ఎండీ సజ్జనార్​

By

Published : Jan 12, 2022, 4:39 PM IST

RTC MD Sajjanar: సంక్రాంతి పండుగకు ఇప్పటివరకు 2,700 బస్సుల్లో 20 లక్షల మంది ప్రయాణికులను సొంతూళ్లకు క్షేమంగా చేరవేశామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. పండుగకు ఆర్టీసీ ప్రత్యేకంగా 4,000 బస్సులను నడిపిస్తోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు 1000, తెలంగాణలో 3 వేల బస్సులు నడిపిస్తున్నామని సజ్జనార్​ వివరించారు. హైదరాబాద్​ ఎంజీబీఎస్​కు వెళ్లిన సజ్జనార్‌.. ఆర్టీసీ అధికారుల సమన్వయం, ప్రయాణికుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం

'పెరుగుతున్న కరోనా కేసులు దృష్టిలో ఉంచుకుని బస్సు ప్రయాణాల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. బస్సులను ఎప్పటికప్పుడు శానిటైజ్​ చేస్తున్నాం. సిబ్బందికి ఇప్పటికే వ్యాక్సినేషన్​ పూర్తయింది. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి. మాస్కులు లేని వారికి మాస్కులు అందిస్తున్నాం. ప్రైవేటు వాహనాల్లో వెళితే రిస్క్​ ఎక్కువ.. కాబట్టి ఆర్టీసీలో ప్రయాణించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సురక్షితంగా మీ గమ్య స్థానాలకు చేరుస్తుంది.' -సజ్జనార్​, ఆర్టీసీ ఎండీ

మాస్క్​ తప్పనిసరి

బస్టాండ్లలో అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్న వారిపై ఇప్పటివరకు 2 లక్షల జరిమానాలు విధించామని సజ్జనార్​ అన్నారు. మాస్క్‌లు లేకుండా ప్రయాణించే వారికి.. బస్సుల్లోనే మాస్క్‌లు అందజేస్తున్నామని వెల్లడించారు. ఆర్టీసీ ప్రచారకర్త కిన్నెర మొగులయ్య పాటలతో ప్రయాణికులను అలరించారు. ఆర్టీసీ బస్సు ప్రయాణంపై కళాబృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

ఆర్టీసీ బస్సుల్లోనే సురక్షిత ప్రయాణం: ఆర్టీసీ ఎండీ సజ్జనార్​

ఇదీ చదవండి:Vanama Raghava Remand Report: వనమా రాఘవ రిమాండ్ రిపోర్టు.. 'మొత్తం 12కేసులు'

ABOUT THE AUTHOR

...view details