తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ ఎండీ బంపర్​ ఆఫర్​.. పేరు పెట్టండి.. రివార్డు గెలుచుకోండి.. - ఆర్టీసీ ఎండీ బంపర్​ ఆఫర్​

RTC Water Bottle Design: టీఎస్​ఆర్టీసీ వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల కోసం స్వయంగా వాటర్​ బాటిళ్లను తయారు చేసి విక్రయించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. మంచి వాటర్​ బాటిల్​ డిజైన్​ను సూచించిన వారికి రివార్డు ఇస్తామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ ప్రకటించారు.

ఆర్టీసీ ఎండీ బంపర్​ ఆఫర్​.. పేరు పెట్టండి.. రివార్డు గెలుచుకోండి..
ఆర్టీసీ ఎండీ బంపర్​ ఆఫర్​.. పేరు పెట్టండి.. రివార్డు గెలుచుకోండి..

By

Published : May 28, 2022, 6:59 PM IST

RTC Water Bottle Design: ప్రయాణీకుల అవసరాలే ఆర్టీసీకి ఆదాయ వనరు. ఈ సూత్రాన్ని అన్ని విధాల అమలు చేస్తోంది తెలంగాణ ఆర్టీసీ. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రయాణికుల మన్ననలతో పాటు ఆదాయాన్ని పెంచుకుంటోంది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు అధికారులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలు ఆఫర్లు తీసుకొచ్చి ప్రజలకు చేరువవుతున్న టీఎస్​ఆర్టీసీ... తాజాగా ప్రయాణికులకు వాటర్ బాటిళ్లను తయారు చేసి, విక్రయించేందుకు సిద్ధమైంది.

మంచి వాటర్ బాటిల్ డిజైన్​ను సూచించండి.. రివార్డు గెలుచుకోండి అని ఆర్టీసీ ప్రకటించింది. ప్రయాణికులకు వాటర్ బాటిళ్లను తయారు చేసి, విక్రయించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విటర్​ ద్వారా తెలియజేశారు. వాటర్ బాటిళ్లకు మంచి టైటిల్, డిజైన్ సూచించాలని ట్విటర్​ వేదికగా కోరారు. ఎవరైతే బెస్ట్ డిజైన్ పంపుతారో వారికి ప్రైజ్ ఇస్తామని పేర్కొన్నారు. ఆర్టీసీ చేస్తున్న చారిత్రాత్మక మార్పుకు మీ తోడ్పాటును ఇవ్వాలని, తద్వారా చరిత్రలో నిలిచిపోవాలని సజ్జనార్ వెల్లడించారు. ప్రయాణికుల కోసం 500 ఎం.ఎల్, లీటర్ వాటర్ బాటిళ్ల ఉత్పత్తిని ప్రారంభించబోతున్నట్టు ఆయన తెలిపారు. ప్రజలు తమ సూచనలను ఆర్టీసీ వాట్సాప్ నంబర్ 9440970000కి పంపాలని కోరారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details