టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్.. టైంవేస్ట్ చేసుకోవద్దని సజ్జనార్ సలహా - RTC MD Sajjanar
Sankranti festival effect సంక్రాంతి పండగ రద్దీ మొదలైంది. విద్యా సంస్థలకు ఈనెల 13 నుంచి 17వ తేదీ వరకూ సెలవులు ప్రకటించారు. ఇక పండగ ప్రయాణాలు నిన్నటి నుంచే జోరందుకున్నాయి. దీనితో పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయింది. సమయం వృథా చేసుకోవద్దని ఆర్టీసీ ఎండీ సజ్జానార్ సలహాఇచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా ప్రయాణించండని సూచించారు.
టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్.. టైంవేస్ట్ చేసుకోవద్దని సజ్జనార్ సలహా
By
Published : Jan 13, 2023, 10:29 AM IST
Sankranti festival Rush సంక్రాంతికి సొంతూరు వెళ్లేందుకు భాగ్యనగరవాసులు తరలివెళ్తున్నారు. విద్యాసంస్థలకు వారం రోజుల సెలవులు రావడంతో పండగ జరుపుకునేందుకు స్వగ్రామాలకు తరలిపోతున్నారు. ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతో పాటు ప్రధాన కూడళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రైళ్లు, బస్సుల్లో సీట్లు దొరక్క పండక్కి వెళ్లేవారు పిల్లాపాపలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Sankranti festival Rush 2023 హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వాహన రద్దీ భారీగా పెరిగింది. పండుగకు ఒక రోజు ముందు నుంచే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సెలవులు ప్రకటించడంతో హైదరాబాద్‌లో నివసించే ప్రజలు తమ స్వగ్రామాల బాట పట్టారు. ఒకే సమయంలో వాహనాలు వేల సంఖ్యలో తరలిరావడంతో యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు అర కిలోమీటరు మేర నిలిచిపోయాయి.
Sankranti festival effect ఒక దశలో ట్రాఫిక్ కిలోమీటరు మేర నిలిచిపోయింది. ఫాస్టాగ్ విధానం అమలులో ఉన్నప్పటికీ వాహనాలు పరిమితికి మించి రావడం, కొన్ని వాహనాల ఫాస్టాగ్‌లు స్కాన్ కాకపోవడంతోనే కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయని టోల్ ప్లాజా నిర్వాహకులు, పోలీసులు చెబుతున్నారు. రాచకొండ పోలీసులు, జీఎంఆర్ టోల్‌గేట్ సిబ్బంది వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు.
ఇదిలా ఉంటే... సొంతవాహనాల్లో ఊళ్లకు వెళ్తూ టోల్‌ప్లాజాల వద్ద సమయం వృథా చేసుకోవద్దని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. గంటల తరబడి టోల్‌ప్లాజాల వద్ద నిరీక్షించవద్దని సూచించారు. టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించండని సలహానిచ్చారు. టోల్‌ప్లాజాల వద్ద ప్రత్యేక లేన్లలో వేగంగా గమ్యస్థానాలకు చేరుకోండని తెలిపారు. ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులను క్షేమంగా సొంతూళ్లకు చేర్చుతారన్నారు.
ఇక పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో 21 టిక్కెట్ కౌంటర్లను ద.మ. రైల్వే ప్రారంభించింది. సాధారణ రోజుల్లో 12 మాత్రమే ఉండేవి. అదనపు సిబ్బందిని నియమించామని ద.మ. రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి సీహెచ్ రాకేష్ తెలిపారు. రైళ్లు ఏ సమయానికి, ఏ ప్లాట్‌ఫామ్‌కు వస్తాయనేది ఎప్పటికప్పుడు ప్రకటించడమే కాకుండా.. సహాయకులను అదనంగా సమకూర్చామన్నారు. టిక్కెట్ తనిఖీ సిబ్బందిని 20 నుంచి 40కి పెంచామన్నారు. టిక్కెట్ తనిఖీ సిబ్బందిని రెట్టింపు చేశామన్నారు. 60 మంది ఆర్‌పీఎఫ్ సిబ్బంది, 30 మంది జీఆర్పీ నిత్యం విధుల్లో ఉండేలా చూస్తున్నామన్నారు.
13, 14 తేదీల్లో పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు..ఈ నెల 13, 14 తేదీల్లో పలు ఎంఎంటీఎస్ రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. లింగంపల్లి-హైదరాబాద్-లింగంపల్లి మధ్య 5 సర్వీసులను, ఫలక్‌నుమా-లింగంపల్లి-ఫలక్‌నుమా మధ్య 11 సర్వీసులను, హైదరాబాద్-ఫలక్‌నుమా-హైదరాబాద్ మధ్య ఒక రైలు సర్వీసును రద్దు చేసినట్లు పేర్కొంది.