తెలంగాణ

telangana

రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు... ఎక్కడికక్కడ అరెస్టులు..

By

Published : Nov 16, 2019, 12:26 PM IST

Updated : Nov 16, 2019, 12:58 PM IST

అన్ని డిపోల ఎదుట బస్​రోకో చేపట్టాలని ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు.. పలుచోట్ల ఉద్రిక్తంగా మారింది. తెల్లవారుజాము నుంచే కార్మికులు ఆందోళనకు దిగారు. ధర్నాలకు అనుమతి లేదంటూ పోలీసులు ఎక్కడివారిని అక్కడే అరెస్టు చేస్తున్నారు.

బస్​రోకో ఉద్రిక్తతం

తమ డిమాండ్ల ఆశయ సాధనే లక్ష్యంగా.. ఈరోజు అన్ని డిపోల ఎదుట బస్​రోకో చేపట్టాలని ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు తెల్లవారుజాము నుంచే కార్మికులు ఆందోళనకు దిగారు. తెల్లవారుజామునే ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఇంటికి పోలీసులు వచ్చారు. ఇటు కార్మికులు కూడా భారీగా రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అశ్వత్థామరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేయగా.. నిరసనగా ఆయన ఇంట్లోనే ధర్నా చేపట్టారు. మరోవైపు ఐకాస కోకన్వీనర్ రాజిరెడ్డిని ఆయన ఇంట్లో అరెస్ట్ చేసి స్టేషన్​కు తరలించారు.

సమ్మెలో భాగంగా వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట డిపో ఎదుట ధర్నా చేసిన ఆర్టీసీ కార్మికులు, అఖిల పక్ష నాయకులను పోలీసులు అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. హైదరాబాద్‌ పాతబస్తీ ఫలక్‌నుమా బస్సుడిపో ఎదుట ఆందోళన చేస్తున్న 40 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. సిద్దిపేటలోనూ.. డిపో ఎదుట బైఠాయించిన కార్మికులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళన చేస్తున్న నిరసనకారులను అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ కార్మికుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. తెల్లవారుజాము నుంచే డిపోల నుంచి బస్సులు రాకుండా అడ్డుకున్నారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు... ఎక్కడికక్కడ అరెస్టులు..

ఇవీ చూడండి : బస్‌ రోకోకు అనుమతి లేదు: సీపీ

Last Updated : Nov 16, 2019, 12:58 PM IST

ABOUT THE AUTHOR

...view details