తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ సడక్ బంద్​పై విపక్ష నేతల భేటీ - ఆర్టీసీ సడక్ బంద్

తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ చేపట్టిన సమ్మె 45వ రోజుకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు ఎక్కడికక్కడ ఆందోళనలు, నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు విపక్ష నేతల ఆధ్వర్యంలో జరిగే సడక్ బంద్ విజయవంతం చేయడం కోసం ఉస్మానియా ఆసుపత్రిలో ఆర్టీసీ ఐకాస నేతలతో సమావేశమయ్యారు.

సడక్ బంద్

By

Published : Nov 18, 2019, 6:28 PM IST


హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో ఆర్టీసీ ఐకాస నాయకులతో విపక్ష పార్టీల నేతలు సమావేశమయ్యారు. దీక్ష చేస్తున్న జేఏసీ నాయకులు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డిల ఆరోగ్య పరిస్థితిపై విపక్ష నేతలు ఆరా తీశారు. లేబర్ కమిషన్‌కు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఆర్టీసీ జేఏసీ నాయకులతో చర్చించారు. రేపటి సడక్ బంద్‌ విజయవంతం చేయడం కోసం మంతనాలు జరిపారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశంలో ఆచార్య కోదండరాం, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, నాగం జనార్దన్ రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.

ఆర్టీసీ సడక్ బంద్

ABOUT THE AUTHOR

...view details