ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చించేందుకు తెజస అధ్యక్షుడు కోదండరాం, ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామ రెడ్డి, రాజిరెడ్డి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌తో భేటీ అయ్యారు. సమ్మెకు మద్దతు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు కోదండరాం నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి వర్గం, జేఏసీ నేతలు భాజపా రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. సమావేశంలో కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం, అన్ని పార్టీలు, ఉద్యోగ సంఘాల మద్దతు, భవిష్యత్ కార్యాచరణపైన చర్చించారు.
లక్ష్మణ్‌తో ఆర్టీసీ జేఏసీ నేతల సమాలోచనలు - Kodandaram Rtc Jac Leaders Meet Laxman about future action
ఆర్టీసీ జేఏసీ భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించింది. ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించిన నేతలు.. వివిధ పార్టీల నేతలతో సమావేశమవుతున్నారు.
![లక్ష్మణ్‌తో ఆర్టీసీ జేఏసీ నేతల సమాలోచనలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4717325-thumbnail-3x2-rtc-bjp-rk.jpg)
లక్ష్మణ్‌తో ఆర్టీసీ జేఏసీ నేతల సమాలోచనలు