సీఎం కేసీఆర్ ప్రతిపాదన సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకేనని ఆర్టీసీ ఐకాస సహ కన్వీనర్ థామస్ రెడ్డి అన్నారు. కార్మికులు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో చేరొద్దని పేర్కొన్నారు. సమ్మె యథాతథంగా కొనసాగుతుందని అన్నారు. అన్ని యూనియన్లు సమావేశమై కేసీఆర్ అర్థరహిత ప్రతిపాదనపై తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. నెల రోజుల నుంచి సమ్మె చేస్తోన్న ఆర్టీసీ కార్మికులకు.. డిమాండ్ల విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వకుండా.. విధుల్లో చేరాలని భయపెట్టడం సరైంది కాదని అన్నారు. ఆర్టీసీ విలీనం సాధ్యమో కాదో చర్చల ద్వారా తెలుస్తుందని... దానిపై చర్చించకుండానే ప్రకటనలు ఇవ్వడం సరికాదని థామస్ రెడ్డి తెలిపారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె యథాతథం: థామస్‌రెడ్డి - tsrtc stirke update news
ఆర్టీసీ కార్మికుల సమ్మె యథాతథంగా కొనసాగుతుందని ఆర్టీసీ ఐకాస సహ కన్వీనర్ థామస్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదన సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకేనని విమర్శించారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె యధాతథం: థామస్‌రెడ్డి
Last Updated : Nov 3, 2019, 7:38 AM IST