ఆర్టీసీకి నష్టాలు, సంస్థ నిర్వీర్యం కావడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని ఐకాస నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన మాటల్లో వాస్తవాలు లేవని ఆర్టీసీ ఐకాస కో కన్వీనర్ థామస్ రెడ్డి అన్నారు. కార్మిక సంఘాల నాయకులంతా ఎంప్లాయిస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ తమకు కన్నతల్లివంటిదని పేర్కొన్నారు. రేపు ఆర్టీసీ ఐకాస సమావేశం ఉంటుందని థామస్‌రెడ్డి స్పష్టం చేశారు. రెండు బృందాలుగా ఏర్పడి.. కార్మికుల వద్దకు వెళ్లి చైతన్యపరుచనున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి దాటవేసే ధోరణి వీడి వెంటనే చర్చలకు పిలవాలని ఆర్టీసీ నాయకులు డిమాండ్ చేశారు.
'ముఖ్యమంత్రి మాట్లాడిన వాటిలో వాస్తవాలెక్కడ' - ఆర్టీసీ కార్మికుల సమ్మె
రేపటి నుంచి రెండు బృందాలుగా ఏర్పడి.. కార్మికుల వద్దకు వెళ్లి వారిని చైతన్యపరుస్తామని ఆర్టీసీ ఐకాస నాయకులు స్పష్టం చేశారు. ఆర్టీసీపై ముఖ్యమంత్రి మాటల్లో వాస్తవాలు ఎక్కడ అని ప్రశ్నించారు.
రేపు కార్మికులను కలుస్తాం: థామస్ రెడ్డి