యూనియన్లు 1920లో పుట్టాయని... యూనియన్లను ఎవ్వరూ నిర్మూలించలేరని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. రాజకీయ వ్యవస్థను నిర్మూలించినప్పుడే యూనియన్ల వ్యవస్థ నిర్మూలించబడుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి మీడియా సమావేశంపై అశ్వత్థామరెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి ప్రతి డిపో నుంచి ఐదుగురితో కమిటీ వేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తమతో కలిసి వచ్చిన అందరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కార్మికులు అందరూ ధైర్యంగా ఉండాలన్నారు. రేపటి నుంచి ఎలాంటి షరతులు లేకుండా విధుల్లో చేరతామని ఆయన స్పష్టం చేశారు.
'రాజకీయ వ్యవస్థ ఉన్నంత వరకూ యూనియన్లు ఉంటాయి' - rtc jac
ముఖ్యమంత్రి మీడియా సమావేశంపై ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పందించారు. యూనియన్లను ఎవరూ నిర్మూలించలేరని పేర్కొన్నారు. ప్రతి డిపో నుంచి కమిటీ వేయడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు.
యూనియన్లను ఎవరూ నిర్మూలించలేరు: అశ్వత్థామరెడ్డి