తెలంగాణ

telangana

By

Published : Nov 1, 2019, 6:09 PM IST

Updated : Nov 1, 2019, 10:34 PM IST

ETV Bharat / state

"ప్రభుత్వం సొమ్ములిస్తే.. అవి ఎటు మళ్లాయో చెప్పాలి"

ప్రభుత్వం బకాయిలు ఇచ్చేశామని అధికారులు హైకోర్టుకు నివేదిస్తున్నారని, అది నిజమైతే ఆ సొమ్ములు ఎటు వెళ్లిపోయాయో సమాధానం చెప్పాలని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్ధామ రెడ్డి అన్నారు.

'బకాయిలు ఏ రూపంలో అందాయే తెలపాలి'

ఆర్టీసీ కార్మికుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆర్టీసీ ఐకాస కన్వీనర్​ అశ్వత్థామ రెడ్డి మండిపడ్డారు. ఆర్టీసీకి రావాల్సిన బకాయిలు అందాయని అధికారులు అంటున్నారని.. అవి ఏ రూపంలో అందాయో తెలపాలని డిమాండ్​ చేశారు. అధికారులు ఆర్టీసీని కాపాడేందుకే ఉన్నారా? లేక అమ్మేందుకు ఉన్నారా... అనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం చెప్పు చేతల్లో ఉండి.. కోర్టుకు తప్పుడు లెక్కలు సమర్పిస్తున్నారని ఆరోపించారు. ఇరవై ఎనిమిది రోజులుగా సమ్మె జరుగుతున్నా స్పందించకపోవడం సిగ్గు చేటని పేర్కొన్నారు. త్వరలో రాస్తారోకోలు, మిలియన్ మార్చ్​ లాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆలోచిస్తున్నామని చెప్పారు. రేపు అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని అశ్వత్థామ రెడ్డి స్పష్టం చేశారు.

'బకాయిలు ఏ రూపంలో అందాయే తెలపాలి'
Last Updated : Nov 1, 2019, 10:34 PM IST

ABOUT THE AUTHOR

...view details