ఆర్టీసీ రూట్లను ప్రైవేటు పరం చేసే అధికారం ఎవరికీ లేదని ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సమ్మెపై ప్రభుత్వ నిర్ణయం తర్వాత రేపు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఎంజీబీఎస్‌లో వివిధ కార్మిక సంఘాలతో కలిసి ఐకాస నేతలు అత్యవసర సమావేశం నిర్వహించారు. విధుల్లో చేరుతామని ప్రకటించి మూడు రోజులు గడుస్తున్నా... ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. సమ్మె యథావిధిగా కొనసాగుతుందని అశ్వత్థామరెడ్డి వెల్లడించారు.
రేపు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం: అశ్వత్థామరెడ్డి - విధుల్లోకి తీసుకుంటారని భావిస్తున్నాం: అశ్వత్థామరెడ్డి
విధుల్లో చేరుతామని ప్రకటించి మూడు రోజులు గడుస్తున్నా... ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని ఆర్టీసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. రేపు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. సమ్మె యథావిధిగా కొనసాగుతుందని అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. ఆర్టీసీ ఐకాస జారీ చేసిన ప్రకటనను ఎండీకి పంపిస్తామని తెలిపారు.
విధుల్లోకి తీసుకుంటారని భావిస్తున్నాం
Last Updated : Nov 23, 2019, 10:57 PM IST
TAGGED:
ts rtc strike latest news