హైకోర్టు సూచన మేరకు నడుచుకుంటామని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. హైదరాబాద్ విద్యానగర్లోని ఈయూ కార్యాలయంలో ఐకాస నేతలు, వివిధ పార్టీలు నాయకులు సమావేశమయ్యారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని అశ్వత్థామ రెడ్డి తెలిపారు. కార్మికుల నిర్ణయానికి సంబంధించిన లేఖను ఆర్టీసీ ఎండీకి పంపామని చెప్పారు.
సానుకూలంగా
సమ్మె, కోర్టు ఆదేశాలపై విపక్షాలతో చర్చించామన్నారు అశ్వత్థామ రెడ్డి. ఆర్టీసీ కార్మికుల సమస్యలను భాజపా నేతలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. మరోసారి ఆర్టీసీ ఐకాస నేతల సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. దిల్లీకి వెళ్లే అంశంపై సమావేశంలో చర్చ జరగలేదన్నారు. ఆర్టీసీ కార్మికుల పట్ల కేసీఆర్ సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
హైకోర్టు సూచన మేరకు నడుచుకుంటాం: అశ్వత్థామ రెడ్డి ఇదీ చదవండి...'కేసీఆర్ తాతా... మమ్మీవాళ్లను చర్చలకు పిలవండి'